Goa Shipyard Limited Recruitment 2025 In Telugu: గోవా షిప్ యార్డ్ లిమిటెడ్
గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ (GSL) నుండి డైరెక్ట్ బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Goa Shipyard Limited Recruitment 2025 ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి Eligibility, Selection, Age Limit, Apply అన్ని వివరాలు చూద్దాం.
మేనేజ్మెంట్ ట్రైని (మెకానికల్)-9 పోస్టులు,
మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 5 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైన్ (ఎలక్ట్రానిక్స్) - 2 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైని(నావెల్ ఆర్చిటెక్చర్) - 12 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైని(ఫైనాన్స్) - 2 పోస్టులు
మేనేజ్మెంట్ ట్రైని(రోబోటిక్స్)- 2 పోస్టులు
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు 25 ఆగస్టు 2025 వ తేదీ నుండి 24 సెప్టెంబర్ 2025 వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
డిగ్రీ అర్హతతో ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు.
Age Limit:
31 జులై 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ Goa Shipyard Limited Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 33 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరముల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
మేనేజ్మెంట్ ట్రైని (మెకానికల్): మెకానికల్/మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్/మెరిన్ ఇంజనీరింగ్ లో బిఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ Goa Shipyard Limited Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే 60% మార్కులతో పాసై ఉండాలి.
మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో బిఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే 60% మార్కులతో పాస్ అయి ఉండాలి.
మేనేజ్మెంట్ ట్రైన్ (ఎలక్ట్రానిక్స్): ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లో బిఈ/బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
మేనేజ్మెంట్ ట్రైని(నావెల్ ఆర్చిటెక్చర్): నావెల్ ఆర్కిటెక్చర్/నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్/నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓసియన్ ఇంజనీరింగ్/నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరిన్ ఇంజనీరింగ్/నావల్ ఆర్కిటెక్చర్ అండ్ Offshore Engg/ఓసియన్ ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్ లో బిఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 60 శాతం మార్కులతో పాసయి ఉండాలి.
మేనేజ్మెంట్ ట్రైని(ఫైనాన్స్) : గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి CA/ICMA చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
మేనేజ్మెంట్ ట్రైని(రోబోటిక్స్): రోబోటిక్స్/రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్/రోబోటిక్స్ అండ్ ఏఐ లో బీయి /బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
రిటర్న్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ ను నిర్వహించడం ఈ Goa Shipyard Limited Recruitment 2025 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ముందుగా కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో పేపర్ ఉంటుంది. 85 మార్కులకు గాను 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది.
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:5 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ను 15 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ,PwBD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Salary:
ట్రైనింగ్ పీరియడ్లో అభ్యర్థులకు 40,000 రావడం జరుగుతుంది. తరువాత మేనేజ్మెంట్ ట్రైనీ పీరియడ్లో సంవత్సరానికి 11.65 లక్షల జీవితం వస్తుంది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్లో సంవత్సరానికి 15.40 లక్షల రూపాయలు జీతం రావడం జరుగుతుంది.
Official Website: www.goashipyard.in
0 కామెంట్‌లు